బ్యాట్ పట్టుకోవడం కూడా రాదా.. సిరాజ్ పై ట్రోల్స్?
ఎందుకంటే బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ప్రారంభించింది భారత జట్టు. ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇక ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తుంది అనుకున్నప్పటికీ చివరికి ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా ఇక విజయాన్ని బంగ్లాదేశ్ కి అప్పగించేస్తుంది టీమ్ ఇండియా. అయితే మొదటి మ్యాచ్లో చేసిన తప్పిదాలను మళ్ళీ పునరావృతం చేయకుండా.. రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా అద్భుతంగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు.
కానీ ఇక బంగ్లాదేశ్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించడంలో తడబడిన టీమిండియా జట్టు చివరికి రెండో మ్యాచ్లో కూడా ఓడిపోయి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే బలహీనమైన బంగ్లాదేశ్ కు సిరీస్ అప్ప చెప్పేసింది. అయితే జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో చివర్లో వచ్చిన రోహిత్ శర్మ గాయాన్ని కూడా లెక్కచేయకుండా మెరుపు హాఫ్ సెంచరీ చేసినప్పటికీ అటు టీమ్ ఇండియా ఓడిపోయింది. అయితే టీమిండియా ఓటమికి బౌలర్ సిరాజ్ ప్రధాన కారణమని నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 48 ఓవర్లలొ సిరాజ్ ఒక పరుగు కూడా చేయలేకపోయాడు. కనీసం బంతిని టచ్ కూడా చేయలేదు. 48వ ఓవర్ లొ కొన్ని పరుగులు వచ్చిన భారత్ విజయ అవకాశాలు మెరుగయ్యేవి. మొదటి వన్డే మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడ్డప్పటికీ కూడా బౌలర్లు మంచి బ్యాటింగ్తో జట్టును గెలిపిస్తే.. ఇక మన బౌలర్లకు కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా రాదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు.