2023 ఐపీఎల్ సీజన్ కు కొత్త చిక్కులు.. ఒకవేళ అదే జరిగితే?
కాగా డిసెంబర్ 23వ తేదీన మినీ వేలం నిర్వహించబోతుంది బీసీసీఐ. 991 మంది ప్లేయర్లు ఇక ఈ మినీ వేలం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం బీసీసీఐ నుండి అందుతున్న సమాచారం ప్రకారం. మార్చి 31 లేదా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభించనున్నారని తెలుస్తుంది. ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ విజేతగా గుజరాత్ నిలవడంతో అహ్మదాబాద్ లోని ముత్తైరా స్టేడియంలో తొలి మ్యాచ్ జరగబోతుంది. అయితే మే 28 లేదా జూన్ 4వ తేదీన ఐపీఎల్ ఫైనల్ జరపాలని బీసీసీఐ చూస్తోంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ తొలి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది.
ఒకవేళ భారత జట్టు గనుక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తే ఇక బిసిసిఐకి కొత్త తలనొప్పి మొదలవుతుంది. ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ సవరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ కు చేరింది అంటే ఇక ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ తేదీని మార్చాల్సి ఉంటుంది. మే 28 లేదా జూన్ 4వ తేదీ కంటే ముందే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించాలి. ఇక ఇలా జరగాలి అంటే ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా మ్యాచ్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు అటు భారత జట్టు అర్హత సాధించాలి అంటే భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియాపై 4-0 తేడాతో విజయం సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి.