షాకింగ్ : క్రికెట్ ఆడుతూ చనిపోయాడు?

praveen
మనిషి జీవితం.. దేవుడు చేతిలో కీలుబొమ్మ లాంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటిది అంతా ట్రాష్ అని కొట్టి పారిస్తూ ఉంటారు. కానీ ఇక వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇది నమ్మకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకోల్లలుగా  వెలుగులోకి వస్తున్నాయి.

 చిన్నారుల దగ్గర నుంచి వృద్దుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏకంగా అప్పుడు వరకు సంతోషంగా ఉండి కళ్ళముందే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.  ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసినప్పుడు మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరిలో  కూడా భయం కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి తరహా వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయ్. ఇది చూసి ప్రతి ఒక్కరిలో ప్రాణ తీపి పెరిగిపోతుంది అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది.

 సాదరణంగా క్రికెట్ ఆడితే ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాదు అటు శారీరక వ్యాయామం కూడా చేసినట్లు అవుతుందని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఇక ఇలా క్రికెట్ ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ క్రికెట్ ఆడటమే అతని ప్రాణాలను తీసేసింది. యూపీలోని కాన్పూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ చివరికి గుండెపోటుతో మరణించాడు. అనూబ్ అనే పదహారేళ్ల బాలుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్న సమయంలో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పు కూలిపోయాడు. అయితే స్నేహితులు అతను చాతిని నొక్కిన ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.. అయితే అప్పటికే సదరు బాలుడు మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: