చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిని అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించుకున్న విరాట్ కోహ్లీ ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను కూడా ఎంతో అలవోకగా బ్రేక్ చేసేసాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న 3 ఏళ్ళ పాటు పేలవమైన ఫామ్ లో కొనసాగి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఆ తర్వాత ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని నిరూపించాడు.


 ఆ తర్వాత కూడా వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచి అద్దరగొట్టాడు అని చెప్పాలి. అయితే టి20 లో బాగా రాణించాడు. కానీ ఇక వన్డే ఫార్మాట్లో మాత్రం మళ్లీ పేలవమైన ఫామ్ కొనసాగించడం తో ఎంతో మంది నిరాశ లో మునిగి పోయారు. కానీ ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ తో చెలరేగి పోయాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను సాధించాడు అని చెప్పాలి. ప్రేక్షకులు అందరూ తనను రికార్డుల రారాజు అని ఎందుకు అంటారు అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించుకున్నాడు.


 ఏకంగా బంగ్లాదేశ్ గడ్డపై వన్డే ఫార్మాట్ లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అంతే కాకుండా ఇక విదేశీ గడ్డపై అత్యధిక తక్కువ మ్యాచ్ల లో వన్డే ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ మరో రికార్డును క్రియేట్ చేశాడు.  మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో సెంచరీ చేయడం తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ప్రస్తుతం అందరూ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ గురించి చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: