అలా జరుగుంటే.. 300 కొట్టేవాడిని : ఇషాన్ కిషన్

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు వన్డే  సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వన్డే సిరీస్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసి ఎంతో అలవోకగా సిరీస్ కొట్టడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో పేలవ ప్రదర్శన చేసింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది టీమిండియా జట్టు అని చెప్పాలి.


 కాగా ఇక టీమిండియా పేలవమైన ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో వరల్డ్ కప్ లో గెలవడం కష్టమే అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి. అయితే ఇటీవల మూడో వన్డే మ్యాచ్లో మాత్రం టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది  ఏకంగా 400కు పైగా స్కోర్ చేసింది. ఇక తర్వాత భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. ఇక ఈ మూడో వన్డే మ్యాచ్లో భారత యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు.


 ఈ క్రమంలోనే ఇక ఈ డబుల్ సెంచరీ ద్వారా ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఇషాన్ కిషన్. ఇకపోతే ఇక మ్యాచ్ అనంతరం తన డబుల్ సెంచరీపై స్పందించిన ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను అవుట్ కాకపోయి ఉంటే కచ్చితంగా 300 పరుగులు చేసే వాడిని అంటూ అభిప్రాయపడ్డాడు.  ఇక విరాట్ కోహ్లీ అండతోనే నేను ఈ రికార్డు సాధించాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్స్ కొట్టి సెంచరీ చేద్దాం అని అనుకున్న.. కానీ కోహ్లీ మాత్రం సింగిల్స్ తోనే సెంచరీ చేయమన్నాడు. ఇదే నాకు కలిసి వచ్చింది అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: