వార్నీ.. ఇలాంటి ఆణిముత్యాన్నా ఇన్నాళ్లు పక్కన పెట్టారా?
ఒక రకంగా చెప్పాలి అంటే ప్రత్యర్థి బంగ్లాదేశ్ బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు ఇషాన్ కిషన్. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ప్రదర్శన గురించి ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు అందరు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడంతో అటు అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. ఎందుకంటే ఇషాన్ కిషన్ లో ఇంతటి ప్రతిప దాగి ఉందా అని ఇన్నాళ్లు మాకు తెలియదు అంటూ ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అయితే ఇంతటి ప్రతిభ ఉన్న ఇషాన్ కు ఇక భారత జట్టులో ఇప్పటివరకు అడపాదడభా అవకాశాలు మాత్రమే దక్కాయి అని చెప్పాలి ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న ఇషాన్ కిషన్ ఇక ఇటీవల ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు అని చెప్పాలి. సీనియర్లు పేలువ ప్రదర్శన చేసిన జట్టుల అవకాశం కల్పించిన సెలెక్టరు ఇంతటి ప్రతిభ ఉన్న ఇషాన్ కిషన్ నూ మాత్రం ఏనాడు పట్టించుకోలేదు దీంతో ఇలాంటి ఆణిముత్యాన్నా ఇన్నాళ్లు పక్కన పెట్టాం అంటూ ఎంతో మంది అభిమానులకు కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.