వార్నీ.. కోహ్లీ రెండు సెంచరీలు.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే?
ఇక ఆ తర్వాత జరిగిన వరల్డ్ కప్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే టి20 లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ వన్డే మ్యాచ్‌లలో మాత్రం విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎందుకొ అతని స్థాయికి తగ్గట్టుగా లేదు అంటూ విమర్శలు వస్తున్న వేళ ఇక ఇటీవల మరోసారి బంగ్లాదేశ్ లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీచేశాడు. దీంతో తన కెరియర్ లో 72వ సెంచరీని అందుకున్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఈ రెండు సెంచరీలు చేసిన సమయంలో కూడా టీమ్ ఇండియాకు రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు అని చెప్పాలి.
గతంలో అప్పనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో 61 బంతుల్లో 122 పరుగులు చేస్తే ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆసియా కప్ లో కోహ్లీ సెంచరీ చేసినప్పుడు భారత్ ఘనవిజయాన్ని అందుకుంటే.. ఇక ఇటీవల కోహ్లీ సెంచరీ చేసిన మ్యాచ్‌లో మరో భారీ విజయాన్ని అందుకుంది భారత్. ఏది ఏమైనా ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీ మాత్రం కోహ్లీకి బాగా కలిసి వస్తుంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన ఎంతో మంది కోహ్లీ అభిమానులు కేఎల్ రాహుల్ ఎక్కువ కాలం పాటు టీమ్ ఇండియా కెప్టెన్ గా కొనసాగితే బాగుండు. కోహ్లీ మరిన్ని సెంచరీలు చేస్తాడేమో అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.