నా కెరియర్ లో.. ఆ మ్యాచ్ ఫుల్ ఎంటర్టైనింగ్ : స్మృతి మందానా

praveen
ఒకవైపు భారత పురుషుల జట్టు వరుస సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్న సమయంలో.. అటు మహిళలు జట్టు కూడా ద్వైపాక్షక సిరీస్ లతో బిజీ బిజీగా గడుపుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు వచ్చింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత మహిళల జట్టుతో ఆస్ట్రేలియా టి20 సిరీస్ ఆడుతుంది. అయితే సొంత గడ్డపై ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న భారత జట్టు అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే నువ్వా నేను అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్లో ఏకంగా రెండు జట్లు కూడా సమానమైన స్కోర్ చేశాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు మాత్రం 16 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా విజయం సాధించింది.


 ఈ క్రమం లోనే ఆస్ట్రేలియా తో రెండవ టి20 మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరగడం గురించి ఇక భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న స్మృతి మందాన తన అనుభవాన్ని వెల్లడించింది. తన కెరీర్ లోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టి20 మ్యాచ్ ఒకటి అంటూ తెలిపింది. ముంబైలో ఆస్ట్రేలియా తో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు 45000 మంది ప్రేక్షకులు వచ్చారు. హై స్కోరింగ్ వికెట్లను చూడటం ఎంతో ఉత్సాహంగా ఉంది  ఈ విజయానికి అటు ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: