కోహ్లీ సెంచరీల రికార్డుపై.. పాక్ మాజీ సెటైర్లు?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ప్రతి అభిమాని కూడా విరాట్ కోహ్లీ సాధించిన రికార్డుల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను అలవోకగా చేదించాడు విరాట్ కోహ్లీ.  ఇక ఇటీవలే  బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి తన కెరీర్లో 72వ సెంచరీ అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేవలం క్రికెట్ ఆటగాళ్లు మాత్రమే కాదు అటు ప్రత్యర్థి  ప్లేయర్లు సైతం విరాట్ కోహ్లీ ప్రతిభ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇక విరాట్ కోహ్లీ ఇలా గొప్ప రికార్డు సాధించడం పై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే అటు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డులపై సెటైర్లు వేయడం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎప్పుడు భారత ఆటగాళ్ల ప్రదర్శన పై అక్కసును వెళ్ళకకే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ల జాబితాలో ఇక ఇటీవల రషీద్ లతీఫ్ కూడా చేరిపోయాడు అని చెప్పాలి. కోహ్లీ రికార్డులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ 100 సెంచరీలు సాధించడం ముఖ్యం కాదు. దేశానికి వరల్డ్ కప్ టైటిల్ అందించడమే ముఖ్యం అంటూ ఎద్దేవా చేశాడు.


 భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ సాధించే రికార్డుల కోసం ఎదురుచూడటం లేదని.. కేవలం టీమిండియా టైటిల్ సాధిస్తే బాగుండు అని కళ్ళు  కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అంటూ రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక తన వ్యాఖ్యలతో ఇటీవలే ఐసీసీ టోర్నీలలో టీమిండియా దారుణ వైఫల్యాలను ఎత్తి చూపాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ 100 కాదు 200 సెంచరీలు కొట్టినా కూడా టీమిండియా టైటిల్ గెలవకపోతే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు ఎద్దేవా చేశాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది భారత అభిమానులు అతని వ్యాఖ్యలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: