అదరగొట్టిన స్మృతి మందన.. కెరియర్ లోనే బెస్ట్ ర్యాంక్?

praveen
టీమిండియా ఉమెన్స్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతోంది స్మృతి మందాన. ఇక ఎప్పుడూ జట్టుకు విజయాన్ని అందించడంలో ఇక ఈ క్రికెటర్ సిద్ధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఓపనర్గా బరులోకి దిగుతూ ఎప్పుడు శుభారంభం అందిస్తూ ఉంటుంది. గత కొంతకాలం నుంచి అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న స్మృతి మందాన ఇక తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను సైతం కొల్లగోడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కేవలం ఆటతీరుతూనే కాదు ఈ క్రికెటర్ తన అందం అభినయంతో కూడా ఎంతోమంది కుర్ర కారు మతి పోగొట్టింది అని చెప్పాలి.


 తన కోర చూపులతో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్గా మారిపోతుంది. ఇక స్మృతి మందాన ఒక్క చిరునవ్వు నవ్వింది అంటే చాలు ఎంతోమంది యువకులు మనసు పారేసుకుంటారు అని చెప్పాలి. ఇలా స్మృతి మందాన ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇకపోతే ఇప్పటివరకు  క్రికెటర్ గా కూడా ఎన్నో రికార్డులను సాధించిన స్మృతి ఇంకా పరుగుల వరద పారిస్తూనే ఉంది. ఇకపోతే పెరియార్ లోనే పిక్  ఫామ్ లో కొనసాగుతున్న స్మృతి మందాన ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన మహిళల టి20 ర్యాంకింగ్స్ లో అదరగొట్టింది అని చెప్పాలి. తన కెరీర్ లోనే బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకుంది. దీంతో అభిమానులందరూ ఆనందంలో మునిగిపోయారు.


 ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఏకంగా 74 పాయింట్ల తో మూడవ స్థానానికి చేరుకుంది స్మృతి మందాన. ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ అయిన తహీల మెక్ గ్రోత్ తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. భారత్కు చెందిన షఫాలీ వర్మ ఆరవ స్థానంలో నిలువగా, రోడ్రిక్స్ ఇక తొమ్మిదవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంకోన్నాళ్లపాటు స్మృతి  మందాన ఇక ఇలాంటి అద్భుతమైన ఫామ్ కొనసాగించింది అంటే ఇక వరల్డ్ నెంబర్వన్ బ్యాటర్ గా మారడం ఖాయమని ఎంతోమంది అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: