మహిళల 3వ టీ 20: ఆస్ట్రేలియా వీర విజృంభణ... ఇండియా చేధించేనా ?

VAMSI
ప్రస్తుతం మహిళల ఆస్ట్రేలియా టీం ఇండియా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్యన అయిదు టీ 20 ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా సిరీస్ 1-1 తో సమంగా ఉంది. మొదటి మ్యాచ్ లో ఛేజింగ్ లో ఆస్ట్రేలియా గెలుపొందగా , రెండవ మ్యాచ్ లో ఇండియా ఛేజింగ్ లో డ్రా చేసుకోగా... సూపర్ ఓవర్ లో ఇండియానే గెలుపు వరించింది. ఇక సిరీస్ లో ముందంజ వేయాలంటే ఈ రోజు ముంబైలోనే బ్రబౌర్న్ స్టేడియం లో జరుగుతున్న మూడవ టీ 20 లో గెలవాల్సి ఉంది. మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపింది.

గత రెండు మ్యాచ్ లలో భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో కూడా ఛాలెంజింగ్ స్కోర్ చేయడానికి ప్రయత్నించింది. అయితే గత రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా లో పడింది కేవలం రెండు వికెట్లే... కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఇండియా బౌలర్లు అద్భుతంగా చెలరేగి ఆస్ట్రేలియా ఆటగాళ్లను కట్టడి చేశారు. ముఖ్యంగా మొదటి ఓవర్ లోనే హీలీ (1) వికెట్ తీసి ఇండియాకు శుభారంభాన్ని అందించింది రేణుక సింగ్... ఆ తర్వాత స్పిన్నర్ దేవికా వైద్య రెండు కీలక వికెట్లు తీసి ఆసీస్ కు బ్రేక్ వేసింది. ఫామ్ లో ఉన్న మూనీని (30) మరియు గార్డనర్ (7) లను అవుట్ చేసి మంచి బ్రేక్ త్రూ ఇచ్చింది. ఇక గత రెండు మ్యాచ్ లలో పరుగుల వరద పారించిన మెగ్రాత్ (1) ను అంజలి బౌల్డ్ చేసింది.

అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో వైపు ఎలీషా పెర్రీ మాత్రం స్కోర్ బోర్డు పడిపోకుండా అడపాదడపా బౌండరీలతో అలరించింది. అలా ఆఖరికి ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచింది. ఈ ఇన్నింగ్స్ లో ఎలీషా పెర్రీ 75 పరుగులు మరియు గ్రేస్ హారిస్
41 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు ఛాలెంజింగ్ టోటల్ ను అందించారు. ఇండియా బౌలర్లలో రేణుక, అంజలి , దీప్తి మరియు దేవిక లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: