ఐపీఎల్ మినీ వేలంలో.. అతిపిన్న వయస్కుడు ఇతనే?
దీంతో ఇటీవల కాలంలో అటు అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలనుకున్న ఎంతోమంది యువ ఆటగాళ్లు.. ఐపీఎల్ లో అవకాశం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఐపీఎల్ కారణంగా కొత్త ప్రతిభ తెర మీదకి వస్తూనే ఉంది. కనీసం ఇక 18 ఏళ్లు కూడా సరిగ్గా నిండకుండానే ఎంతో మంది ప్లేయర్లు కూడా అటు ఐపిఎల్ లో పాల్గొంటూ రికార్డులు సృష్టిస్తూ ఉండడం కూడా చూస్తూనే ఉన్నాం. 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం డిసెంబర్ 23వ తేదీన కొచ్చి వేదికగా జరగబోతుంది.
ఇక ఎప్పటి లాగానే ఈ ఏడాదికి కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఫ్రాంచైజీలు కూడా యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో మినీ వేలం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అతి పిన్న వయస్కుడు అయిన ప్లేయర్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అల్లా మహమ్మద్ ప్రస్తుతం మినీ వేలంలో పాల్గొన్న ప్లేయర్లలో అతిపిన్న వయస్కుడిగా ఉన్నాడు. అతని వయసు 15 ఏళ్ల 152 రోజులే కావడం గమనార్హం. పదహారేళ్లు కూడా నిండకముందే ఏకంగా వేలంలో పాల్గొంటున్నాడు. ఇక అతన్ని ఏదైనా ఫ్రాంచైజీ చేసి కొనుగోలు చేస్తుందో లేదో చూడాలి మరి.