కేవలం 3 రోజుల్లో ముగియనున్న "ఇండియా - బంగ్లాదేశ్" టెస్ట్ ?

VAMSI
చట్టోగ్రామ్ టెస్ట్ లో రెండు రోజుల ఆట ముగిసిపోయింది. అయితే గత రెండు రోజుల నుండి సాగుతున్న ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఆతిధ్య జట్టు పూర్తిగా తేలిపోతోంది అని చెప్పాలి. నిన్న మొదటి సెషన్ లో మాత్రమే కాస్త సక్సెస్ అయ్యారు. మిగిలిన అన్ని సెషన్ లలో ఇండియానే పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. ఇండియా లీడ్ ను బౌలర్లు అశ్విన్ మరియు కుల్దీప్ లు బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని
404 పరుగులకు పెంచారు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన బంగ్లాకు సిరాజ్ మొదటి బంతికే ఇండియాకు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది..

రెండవ రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ 44 ఓవర్లు పాటు ఆడి 133 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఇండియా బౌలర్లలో కుల్దీప్ 4 మరియు సిరాజ్ 3 వికెట్లు తీసుకుని బంగ్లా పతనాన్ని శాసించారు. అయితే ప్రస్తుతం బంగ్లా ఉన్న పరిస్థితులలో ఫాలో ఆన్ ను తప్పించుకోవడానికి ఇంకా 150 పరుగుల వరకు చేయాల్సి ఉంది. మిగిలి ఉన్న రెండు వికెట్ లతో అన్ని పరుగులు చేస్తారా అన్నది సందేహమే. అందులోనూ సిరాజ్ మరియు కుల్దీప్ లు వికెట్ల వేటలో ఉన్నారు. ఇండియా బౌలర్లు కనుక ఇదే జోరును కొనసాగిస్తే, రేపు మార్నింగ్ సెషన్ అయిదు నుండి పది ఓవర్ లలోపే బంగ్లా ఇన్నింగ్స్ పూర్తవుతుంది.

కాగా ఎలాగు ఇండియా బంగ్లాను ఫాలో ఆన్ ఆడించడం పక్కా, కాబట్టి లంచ్ సమయానికి లేదా రేపు సాయంత్రం మూడవ రోజు ఆట ముగిసే సమయం లోపు రెండవ ఇన్నింగ్స్ లోనూ బంగ్లా ఆల్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అలా ఇండియా బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ ఎటు లేదన్నా రేపుటికి ముగిసిపోయి ఇండియా ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: