చతేశ్వర్ పుజారా ఫాస్టెస్ట్ సెంచరీ తో రికార్డ్... 52 ఇన్నింగ్స్ ల తర్వాత!

VAMSI
ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవ రోజు కాసేపట్లో ముగియనుంది. ఈ రోజు ఉదయాన ఇండియా బంగ్లాను 150 పరుగులకు ఆల్ అవుట్ చేసిన తర్వాత ఫాలో ఆన్ ను ఆడించకుండా ఇండియా నే బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మరోసారి రాహుల్ (23) కు దొరికిన చక్కని ఆరంభాన్ని ఉపయోగించుకోవడంలో ఫెయిల్ కాగా.. మరో ఓపెనర్ శుబ్మాన్ గిల్ మాత్రం సమయస్ఫూర్తితో ఆడుతూ కెరీర్ లో మొదటి సెంచరీని సాధించాడు. శుబ్మాన్ గిల్ 152 బంతుల్లో 110 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు మరియు 3 సిక్సులు ఉన్నాయి.

ఆ తర్వాత పుజారా మరియు కోహ్లీలు (19) కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ను 258 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. అయితే ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ ఛతేశ్వర్ పుజారా ఈ మధ్యన ఫామ్ కోల్పోయి టెస్ట్ లలో ఆడడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు. కానీ ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఎంతో విలువైన 80 పరుగులు చేశాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో అయితే పుజారా ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. పుజారాకు గత 52 టెస్ట్ ఇన్నింగ్స్ లుగా సెంచరీ లేదు.. ఇన్నాళ్లూ సెంచరీ లేని లోటును ఈ రోజుతో పూర్తి చేసుకున్నాడు. పుజారా 130 బంతుల్లో 102 పరుగులు చేసి తన కెరీర్ లో ఫాస్టెస్ట్ సెంచరీ ని నమోదు చేశాడు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 13 ఫోర్లు ఉండడం గమనార్హం.

పుజారా సెంచరీ ముగియగానే ఇండియా తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం బంగ్లా లక్ష్యం 472 పరుగులు. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ చేధించగలదా అంటే... ఖచ్చితంగా కష్టమే అని చెప్పాలి. కానీ ఎన్ని పరుగులు సాధించి ఇండియా బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కోగలదు అన్నది చూడాలి. ప్రస్తుతం క్రీజులో జాకీర్ హుస్సేన్ 19 మరియు శాంటో 22 పరుగులతో ఉన్నారు. ఆటముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 513 పరుగులు చేసింది.        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: