సిడ్ని థండర్స్ ఓటమి.. ఆనందంలో ఆర్సిబి ఫ్యాన్స్?

praveen
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సిడ్నీ థండర్స్, ఆడి లైట్  స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ప్రత్యర్థి ఆడిలైట్ స్ట్రైకర్స్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో సిడ్నీ తండర్స్ జట్టు ఘోరంగా తడబడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది ఆ జట్టు.  దీంతో ఇక టి20 క్రికెట్ చరిత్రలో అత్యంత చత్త రికార్డులను నమోదు చేసింది అన్న విషయం తెలిసిందే.  టి20 క్రికెట్ చరిత్రలో ఇక అతి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయిన జట్టుగా వరస్ట్  రికార్డును ఖాతాలో వేసుకుంది సిడ్ని థండర్స్ జట్టు.


 ఈ క్రమంలోనే ఎంతోమంది ఆ జట్టు అభిమానులు ఇక పేలవ ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి.  జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇంత దారుణమైన ప్రదర్శన ఏంటి అంటూ సోషల్ మీడియా వేదిక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో అటు ఐపిఎల్ ఫ్రాంచైజీ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు. ఓడిపోయినందుకుగాను సిడ్నీ థండర్స్ జట్టుకి కృతజ్ఞతలు చెబుతూ ఉండటం గమనార్హం.


 అదేంటి సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి చివరికి చెత్త రికార్డు నమోదు చేస్తే ఆర్సిబి అభిమానులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు. సిడ్నీ థండర్స్ ఓడిపోవడానికి ఆర్సిబి సంబరాలు చేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అనే ఆలోచన మీ మదిలో మెదిలే ఉంటుంది. అయితే ఇక ఇలా బెంగుళూరు జట్టు అభిమానులు సంబరాలు చేసుకోవడానికి.. ఒక పెద్ద కారణమే ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా బెంగళూరుకి ఒక చెత్త రికార్డు ఉంది. 2017 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి జట్టు 49 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇటీవల సిడ్నీ  15 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో ఆర్సిబి కంటే చెత్త ప్రదర్శన చేసింది. దీంతో ఇక ఆర్సిబిని విమర్శించే వాళ్ళు తక్కువ అవుతారని. ఎందుకంటే ఆర్సిబి కంటే చెత్త రికార్డును సిడ్ని థండర్స్  సాధించిందని ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: