రెండవ టెస్టులో కూడా.. కెప్టెన్ రోహిత్ డౌటే?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేలవమైన ప్రదర్శన కారణంగా  జట్టుకు భారంగా మారిపోతున్న రోహిత్ శర్మ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇక బొటన వేలుకి గాయం కావడంతో చివరికి ఇక టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయిన నేపథ్యంలో అతని స్థానంలో కేఎల్ రాహుల్ సారధ్య బాధ్యతలను  చేపట్టాడు అన్న విషయాన్ని తెలిసిందే.


 అయితే అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎందుకో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో విజయాన్ని సాధించినప్పటికీ కూడా టీమిండియా కు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయాన్ని అందించాడు.


 అయితే రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్ కు దూరమైనప్పటికీ ఇక రెండువ టెస్ట్ మ్యాచ్ కు గాయం నుంచి కోలుకొని జట్టులోకి వస్తాడని బీసీసీఐ తెలిపింది. కానీ ప్రస్తుతం ఇక రెండవ టెస్టు మ్యాచ్లో కూడా రోహిత్ ఆడటం అనుమానంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదట. ఈ క్రమంలోనే అతనికి ఇక రెండో టెస్టులో కూడా ఆడించాలని జట్టు యాజమాన్యం అనుకోవట్లేదట. ఇక రోహిత్ ప్రస్తుతం టీమిండియా జట్టు సెలక్షన్ లో లేకపోవడంతో ఇక సెలక్టర్లకు తుదిజట్టు ఎంపిక ఎంతో సులభతరం అయింది. ఎందుకంటే రోహిత్ ను ఎంపిక చేయాలా లేకపోతే శుభమన్ గిల్ ను తీసుకోవాలి అనే విషయం సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: