RCB ఐపీఎల్ ప్లాన్స్: వేలంలో కొనుక్కునేది ఆ ఇద్దరినే ?

VAMSI
ఐపీఎల్ సీజన్ 16 కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే అన్ని ఫ్రాంచైజీలు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ముఖ్యంగా జట్టు కూర్పుపై దృష్టి సారించారు, అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో పాల్గొంటున్న పది జట్ల దగ్గర కొందరు ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. గత సంవత్సరం ఆయా ప్లేయర్స్ ప్రదర్శనను ఆధారంగా చేసుకున్న ఫ్రాంచైజీ యాజమాన్యాలు కొందరిని ఈ నెలలో జరిగియే మినీ వేలానికి వదిలేశారు. అందుకే ఈ మినీ వేలంలో కొరత ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మినీ వేలంలో ఉన్న ఆటగాళ్లపై దృష్టిని సారించారు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 15 సీజన్ లు ముగిసినా , జట్టు నిండా స్టార్లు ఉన్నా ఐపీఎల్ టైటిల్ ను మాత్రం దక్కించుకోలేకపోయారు. దీనిపై సర్వత్రా ఆర్సీబి విమర్శలను ఎదుర్కొన్నది.

అందుకే రాబోయే సీజన్ లో ఎలాగైనా వేలంలో కీలక ప్లేయర్స్ ను దక్కించుకుని టైటిల్ కలను నెరవేర్చుకోవాలన్నది వారి ఆకాంక్ష. ప్రస్తుతం వీరికి అవసరమైన స్లాట్స్ లో ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ మరియు ఇండియాకు చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ లు ఉన్నాయి. ఇటీవల జరిగిన రిటెన్షన్ లో ఆస్ట్రేలియా కు చెందిన ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహెన్ డార్ఫ్ ను ముంబైకు ట్రేడ్ చేశారు. దీనితో అతని ప్లేస్ ను భర్తీ చేయాల్సి ఉంది. ఇక మరో స్థానం ఓపెనర్ కోసం వేటను కొనసాగిస్తున్నారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ ప్రస్తుతం ఓపెనర్ గా తన రోల్ ను నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు డుప్లిసిస్ కు జోడీగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చేవాడు.

కానీ కోచ్ ఆలోచనల ప్రకారం తనకు బాగా కలిసి వచ్చే వన్ డౌన్ ప్లేస్ లో కొనసాగించడానికి ప్లాన్ చేస్తున్నారట. అప్పుడు డుప్లిసిస్ కు ఎవరు జోడీగా రానున్నారు అన్నది డౌట్ గా ఉంది. అందుకే జరగబోయే వేలంలో ఒక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ మరియు ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ కొనాలి. ఫాస్ట్ బౌలింగ్ కు నాథన్ కోల్టర్ నైల్ , జై రీచర్డ్సన్ , ఆడమ్ మిల్నే లేదా రీస్ టాప్లె లలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ లో మయాంక్ అగర్వాల్ మరియు నారాయణ జగదీశన్ లలో ఒకరిని తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: