ఆర్సిబి జట్టులోకి ఇంగ్లాండ్ ఎమర్జింగ్ బౌలర్.. ఈసారైనా టైటిల్ కలా తిరుగుతుందా?
ఇంతమంది బెంగళూరు జట్టుకు టైటిల్ సాధించడం కోసం పోరాడిన కూడా చివరికి ఐపీఎల్ ట్రోఫీ మాత్రం ఒక్కసారి కూడా దక్కించుకోలేకపోయింది బెంగళూరు జట్టు. బెంగళూరు ఆటగాళ్ల ప్రదర్శన బాగానే ఉన్న ఎందుకో ఆ జట్టు టైటిల్ గెలవలేక పోతుంది అన్నది ఇప్పటికీ అభిమానుల్లో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది అని చెప్పాలి. అయితే 2022 సీజన్లో అయినా ఆర్సిబి రాత మారుతుందని అనుకున్నారు అందరూ. అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయిన ఆర్సీబీ జట్టు చివరికి ప్లే ఆఫ్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మాత్రం నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోయింది. దీంతో ఫాన్స్ కి మళ్లీ నిరాశ మిగిలింది అని చెప్పాలి.
2023 ఐపీఎల్ ఐపీఎల్ సీజన్ లో ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టాలి అనే ఉద్దేశంతో ఇక ఇటీవల కొంతమంది ఆటగాళ్ళను జట్టు నుంచి వేలంలోకి వదిలేసి.. ఇక ప్రతిభగల ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు అని చెప్పాలి. కొచ్చి వేదికగా జరిగిన మినీ వేలంలో ఆ జట్టు ఇంగ్లాండ్ జట్టులో ఎమర్జింగ్ ప్లేయర్‌గా కొనసాగుతున్న టాప్ బౌలర్ రీస్ టాప్లి ని కొనుగోలు చేసింది. అతని కోసం 1.9 కోట్లు వెచ్చించింది అని చెప్పాలి. ఇక అతనితోపాటు హిమాన్షు శర్మను 20 లక్షల బ్రైస్ ప్రైస్ తో జట్టులోకి తీసుకుంది. విల్ జాక్సన్ 3.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇలా ఇంగ్లాండ్ జట్టులో మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్‌గా కొనసాగుతున్న బౌలర్ ఇక ఆర్సిబి లోకి రావడంతో.. జట్టు కాస్త పటిష్టంగా మారింది. దీంతో ఇక ఈసారి కప్పు కొట్టడం పక్క అని ఎంతో నమ్మకం పెట్టుకుంటున్నారు అభిమానులు.
RCB ఫుల్ స్క్వాడ్ :
ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రాడ్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ పత్ర్ కౌల్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, రీస్ టాప్లీ.