ఇప్పటికైనా సంజూకి చోటు దక్కుతుందేమో : వసీం జాఫర్
ఒకవేళ భారత జట్టు కోసం సంజూ శాంసన్ ను ఎంపిక చేసినప్పటికీ అతను కేవలం బెంచ్ స్ట్రెంత్ కు మాత్రమే పరిమితం అవుతున్నాడు. దీంతో గత కొంతకాలం నుంచి బీసీసీఐ సంజూ శాంసన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై అభిమానులందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. బిసిసిఐ కావాలని సంజూ శాంసన్ ను పక్కన పెడుతుంది అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఏకంగా నిలకడగా రాణిస్తూ ఉన్న సంజూ శాంసన్ కు అవకాశాలు ఇవ్వక పోవడానికి గల కారణాలు ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. టీమిండియా మరికొన్ని రోజుల్లో శ్రీలంక న్యూజిలాండ్ తో టీ20 వన్డే సిరీస్ లు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లలో అయినా సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని అటు అభిమానులు డిమాండ్ చేస్తూ ఉండగా.. ఇక ఇప్పుడూ వసీం జాఫర్ సైతం ఇదే చెప్పుకొచ్చాడు. శ్రీలంక న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌లలో సంజు సంజూ శాంసన్ కి చోటు దక్కుతుందని ఆశిస్తున్న అంటూ తెలిపాడు. నిలకడగా రాణించి జట్టులో స్థానం ఖాయం చేసుకోవాలంటూ సూచించాడు.