సంజు శాంసన్ పై.. కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
కొత్త ఏడాదిలో మొదటి వారంలోనే అటు టీమిండియా వరుసగా సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత పర్యటనకు రాబోతున్న శ్రీలంక జట్టుతో టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది. ముఖ్యంగా టి20 సిరీస్ లో భాగంగా అటు యువ ఆటగాడు హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ టి20 జట్టులో సీనియర్లు ఎవరూ కూడా కనిపించడం లేదు.


 మొత్తం యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతోనే అటు టీమిండియా శ్రీలంకతో తలబడబోతుంది అని చెప్పాలి. ఇకపోతే జనవరి మూడవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 సిరీస్ కు సంబంధించి ఇప్పటికే ఇరుజట్లు కూడా తమ స్క్వాడ్స్ ను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇక ఇరుజట్ల మాజీ ఆటగాళ్లు కూడా ప్లేయర్స్ ఆట తీరుపై రివ్యూ చెబుతున్నారని చెప్పాలి. కాగా శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగకర కూడా పలువురు భారత ఆటగాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఉన్న యువ ఆటగాడు సంజు శాంసన్ సుదీర్ఘ కాలం పాటు ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు కుమార సంగకర.


 సంజు  ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతడు భారత్ తరపున సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్న.. ఇక ఋతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ అన్నా కూడా నాకు ఎంతో ఇష్టం. మరోసారి శ్రీలంకతో సిరీస్లో అతని ఆటను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇక టీమిండియాతో జరగబోయే టి20 సిరీస్ శ్రీలంకకు కఠినమైన సవాలు. కానీ టీ20 లో ఇండియాను ఎదుర్కోవడానికి శ్రీలంక అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది అంటూ కుమార సంగకర చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు భారత జట్టులో రిషబ్ పంత్కు బదులు సంజు శాంసన్ కు అవకాశం దక్కింది. మరి తుది జట్టులోకి వస్తాడో లేదో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: