రిటైర్మెంట్ వెనక్కి.. జట్టులోకి రావడమే టార్గెట్ అంటున్న స్టార్ ఫేసర్?
అయితే ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్లో మాత్రం ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని మళ్ళీ జాతీయ జట్టులోకి రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్ స్టార్ ఫేసర్ మహమ్మద్ అమీర్ మళ్ళీ జాతీయ జట్టు తరఫున రి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మొన్నటి వరకు పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న రమిజ్ రాజా తో విభేదాల కారణంగా 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు మహమ్మద్ అమీర్. అయితే ఇటీవల క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా రమిజ్ రాజా స్థానంలో నజం సేథి వచ్చాడు అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోని కొత్త అధ్యక్షుడు సేథి సైతం మహమ్మద్ అమీర్ మళ్లీ ను మళ్ళీ పాకిస్తాన్ జట్టులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే లాహోర్లోని నేషనల్ హై పర్ఫామెన్స్ సెంటర్లో ప్రత్యేకమైన శిక్షణ పొందేందుకు మహమ్మద్ అమీర్ కు ఇటీవలే పాక్ క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన మహమ్మద్ అమీర్.. మళ్ళీ పాకిస్తాన్ జెర్సీ ధరించెందుకు.. జట్టు తరఫున మళ్లీ ప్రాతినిధ్యం వహించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అల్లా దయ ఉంటే ఇదంతా జరుగుతుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మంచి ప్రదర్శన చేసి మళ్ళీ జాతీయ జట్టులోకి రావడమే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు.