అమావాస్య పున్నానికి అవకాశం.. సంజూని ఏకిపారేసిన గవాస్కర్?
సంజు శాంసన్ లో ఉన్న టాలెంట్ను టీమిండియా కోసం ఉపయోగించుకోవాలి అంటూ ఎంతో మంది సలహాలు కూడా ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో రోజుల నుంచి భారత జట్టులో చోటు సంపాదించుకోలేకపోతున్న సంజూ శ్యాంశాన్ ఇక ఇటీవల కొత్త ఏడాదిలో శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో మాత్రం అవకాశం దక్కించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా సంజు శాంసన్ అదరగొడతాడని అభిమానులు భావించారు.
కానీ ఊహించిన రీతిలో నిరాశపరిచాడు. అప్పటికే జట్టు తక్కువ పరుగులకే ఎక్కువ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో.. క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ కేవలం 6 బంతులు మాత్రమే ఆడి 5 పరుగులు చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే సంజు శాంసన్ చెత్త షాట్ ఆడి వికెట్ చేజార్చుకోవడంపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీలకమైన క్యాచ్ ని కూడా వదిలేశాడు సంజు శాంసన్. ఎంత టాలెంట్ ఉన్న ఏం లాభం మరోసారి చేత్త షాట్ తో వికెట్ చేజార్చుకున్నాడు.. అమావాస్యకు పున్నానీకో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి ప్రదర్శన ఏంటి అంటూ ప్రశ్నించాడు సునీల్ గవాస్కర్.