తారు రోడ్డు లాంటి పిచ్ లపై ఆడి.. బాబర్ రికార్డులు కొడతాడా?

praveen
మొన్నటి వరకు పాకిస్తాన్ పర్యటనపై ప్రపంచ క్రికెట్లో ఉన్న అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా నిషేధం కొనసాగించాయి అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లేందుకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి విదేశీ జట్లు వరుసగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్తూ అక్కడ అన్ని ఫార్మాట్ల సిరీస్ లు ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ పాకిస్తాన్లో ఉన్న పిచ్ లపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

 కనీసం గల్లి గల్లి క్రికెటర్లు కూడా ఇలాంటి పిచ్ లపై ఆడరేమో అంటూ ఎంతో మంది స్టార్ క్రికెటర్లు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  ఇలాంటి పిచ్లపై ఎలా ఆడాలో కూడా తెలియడం లేదంటూ తమ సంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తి పరుస్తూ ఉండడం గమనార్హం. ఇక ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అయితే పాకిస్తాన్ లో  ఉన్న పీచ్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్  ఏకంగా పాకిస్తాన్ ఫిచ్ లపై మండిపడుతూ తీవ్ర విమర్శలు గుప్పించాడు.

 ఇలాంటి పిచ్లు తయారు చేయమని మీకు ఎవరు చెప్పారు.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం చెప్పాడా.. ఈ రోడ్లపై ఆడి తమ ఆటను మెరుగుపరచుకోవాలని బాబర్ అనుకుంటున్నాడా అంటూ ఘాటు ప్రశ్నలు సంధించాడు సైమన్ డౌల్. కరాచీ వేదికగా న్యూజిలాండ్తో పాకిస్తాన్ రెండో టెస్టు ఆడుతున్న సందర్భంగా ఇక సైమన్ డౌల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అయితే కాస్తయినా నాణ్యతలేని పిచ్ లపై విదేశీ ఆటగాళ్లు ఇబ్బంది పడుతూ ఉండగా.. ఇక స్వదేశంలో అలాంటి పిచ్ లపై ఆడిన అనుభవం ఉండడంతో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం బ్యాటింగ్లో రెచ్చిపోతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: