కోహ్లీ మళ్లీ అలాంటి సిక్సర్లు కొట్టలేడు : పాక్ బౌలర్
అయితే ఇక ఈ టి 20 మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు ఓడిపోవడం ఖాయం అనుకుంటున్న సమయంలో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ విజృంభించిన తీరు సగటు క్రికెట్ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మొదట కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మాత్రం సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ హారీష్ రావుఫ్ బోలింగ్ లో కొట్టిన రెండు సిక్సర్లను అయితే ప్రేక్షకులు అసలు మరిచిపోలేరు అని చెప్పాలి.
విరాట్ కోహ్లీ సిక్సర్ల సునామీలో బలి అయిన పాకిస్తాన్ స్టార్ బౌలర్ హరీష్ రావుఫ్ సైతం ఇక ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో విరాట్ కోహ్లీ కొట్టిన ఆ సిక్సర్ల గురించి మాట్లాడాడు ఇక ఇటీవల మరో కొత్త ఇంటర్వ్యూలో కూడా ఈ సిక్సర్ లను గుర్తు చేసుకున్నారు అని చెప్పాలి. అలాంటి సిక్సర్లు విరాట్ కోహ్లీ మళ్ళీ కొట్టలేడు అంటూ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ఇక ఆ సమయంలో విరాట్ కోహ్లీ కొట్టిన షాట్లు చాలా అరుదైనవి అంటూ హరీష్ రావుఫ్ చెప్పుకొచ్చాడు..