రోహిత్ అలాంటి బంతులకు ఇబ్బంది పడతాడు : పాక్ మాజీ
ఇక ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు పాకిస్తాన్ మాజీ ఫేస్ బౌలర్ మహమ్మద్ అమీర్. ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ స్టార్ బ్యాట్స్మెన్ గా కూడా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఆట తీరుతో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ టీమ్ ఇండియాకు మంచి శుభారంభలు ఇస్తూ ఉంటాడు. ఇకపోతే టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మ ఎలాంటి బంతులకు ఇబ్బంది పడతాడో అన్న విషయాన్ని ఇటీవల పాకిస్తాన్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు.
2017 ఛాంపియన్స్ ట్రోపీలో తాను రోహిత్ శర్మను అవుట్ చేయడం గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడు మహమ్మద్ అమీర్. రోహిత్ శర్మ ఇన్ స్వింగ్ బౌలింగ్లో ఇబ్బంది పడతాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే అంటూ మహమ్మద్ అమీర్ వ్యాఖ్యానించాడు. అందుకే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా థర్డ్ మ్యాను సర్కిల్లోకి తీసుకువచ్చి ఇక రోహిత్ శర్మకు వరుసగా ఇన్స్ స్వింగర్లు సందించాను అంటూ మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు. తద్వారా ఇక రోహిత్ శర్మ ఇబ్బంది పడి తొందరపాటుతో వికెట్ చేజార్చుకున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు.