ఉమ్రాన్ హిస్టరీ.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు?

praveen
స్పీడ్ బౌలింగ్ తో ఒక్కసారిగా భారత క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్ ఇక తన బౌలింగ్ వేగంతో మాజీ ఆటగాళ్లను కూడా ఆశ్చర్యపరచాడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరి టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ తానే అన్న భావనను అందరిలో కలిగించాడు. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లు సైతం మొదటిసారి స్పందించి అతన్ని వెంటనే జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసే విధంగా తన ఆటతో ప్రభావితం చేశాడు అని చెప్పాలి. టీమిండియాలోకి వచ్చిన తర్వాత కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

 మెరుపు వేగంతో బంతులను విసురుతూ ప్రత్యర్థులలో వణుకు పుట్టిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాకుండా కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. అయితే బంతిలో వేగం మాత్రమే కాదు వైవిధ్యాన్ని కూడా చూపిస్తూ ఇక ఔరా అనిపిస్తున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఇటీవల శ్రీలంకలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో అందరికంటే ఎక్కువగా మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వేగంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఉమ్రాన్ మాలిక్. ఏకంగా 156 కిలోమీటర్ల వేగంతో ఒక బంతిని విసిరిన విషయం తెలిసిందే.

 తద్వారా ఒక అరుదైన  రికార్డు సృష్టించాడు. భారత జట్టు తరఫున వన్డే ఫార్మాట్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్గా ఉమ్రాన్ మాలిక్ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తాను వేసిన రెండో ఓవర్ లో ఏకంగా ఒక బంతిని 156 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. దీంతో రికార్డు సృష్టించాడు. అయితే అంతకుముందు శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లోను ఉమ్రాన్ మాలిక్ 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరీ ఇక తద్వారా ఇండియా తరపున టి20 లో అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్గా కూడా అటు ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి..  ఐపీఎల్ లోను ఇండియా తరపున అత్యంత వేగంగా 157 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరిన బౌలర్గా కూడా ఉమ్రాన్ మాలిక్ మొదటి స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: