ఇక పాత కోహ్లీని చూస్తారు : మంజ్రేకర్
ఇక ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో ఇక ఇటీవల విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం భారత జట్టు అభిమానులు అందరిలో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపింది అని చెప్పాలి. భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. క్రీజూలోకి రావడం రావడమే దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. తద్వారా ఇక తన కెరియర్ లో 73వ సెంచరీని నమోదు చేశాడు విరాట్ కోహ్లీ.
కోహ్లీ ఇదే ఫామ్ లో కొనసాగితే వరల్డ్ కప్ గెలవడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. ఇక ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ ఏడాది విరాట్ కోహ్లీ పూర్వ వైభవాన్ని సాధించడం ఖాయమంటూ జోష్యం చెప్పాడు. వన్డే ఫార్మాట్లోకి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు తక్కువేనని.. దీంతో అతడు మునుపటి ఫామ్ నిలకడను అందుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఇక వన్డే ఫార్మాట్లో ఆడటం అటు రోహిత్ శర్మకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అంటూ సంజయ్ మంజ్రైకర్ వ్యాఖ్యానించాడు.