ఏం కొట్టాడబ్బా.. విరాట్ కోహ్లికే దిమ్మతిరిగింది?

praveen
క్రికెట్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కోహ్లీ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. అంతలా క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నాడు కోహ్లీ. ఓ రకంగా చెప్పాలంటే సచిన్ తరువాత ఆ స్థాయి నటనని ప్రదర్శించింది కోహ్లీ అని చెప్పుకోవచ్చు. అందుకే అతగాడు గ్రీజులో ఉంటే అభిమానులకు సైతం పూనకాలు తెప్పిస్తాడు. అయితే కొంతకాలంగా కోహ్లీ కాస్త తన ఆటతీరు విషయంలో మాత్రం తడబడుతున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే 2022లో మరలా తన పాత పరంపరని కొనసాగించాడు.
ఇకపోతే టీమిండియాతో రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ ఎలాంటి ఆట తీరుని ప్రదర్శిస్తున్నాడో చెప్పాల్సిన పనిలేదు. గత మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్లో డకౌట్ అయిన ఈ వికెట్ కీపర్.. కోల్కతా మ్యాచ్లో 34 పరుగులు మాత్రమే చేసాడు. అయితే, 18 ఓవర్ మొదటి బంతికి టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతికి చిక్కి LBW అయ్యి వెనుదిరిగాడు. తాజగా ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్లో 34 బంతులు ఎదుర్కొన్న మెండిస్ 34 పరుగులు చేసిన సంగతి విదితమే. అయితే టీమిండియా పేస్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో మాత్రం ఇతగాడు కొట్టిన ఏకైక సిక్సర్ ఆ మ్యాచ్ కే హైలైట్ గా నిలవడం విశేషం.
ఈ క్రమంలో మెండిస్ కొట్టిన సిక్స్ చూసి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు అంటే మీరు నమ్మితీరాల్సిందే. దానికి కారణం అతగాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ దానికి కారణం.... 'ఇదెలా సాధ్యమైందిరా బాబు' అన్నట్లుగా నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని.. షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు విరాట్. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా రెండో వన్డేలో శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రోహిత్ సేన.. సిరీస్ విజయమే లక్ష్యంగా ఛేదనకు దిగనుంది. ఇక ఇప్పటికే గువహటి మ్యాచ్లో భారీ విజయం సాధించి ఆతిథ్య భారత్ 1-0తో సిరీస్లో ముందంజలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: