వారెవ్వా.. సచిన్, కోహ్లీలను దాటేసిన రంజీ ప్లేయర్?

praveen
బ్రాడ్‌మన్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సగటు నమోదు చేసిన ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ కి మంచి పేరు వుంది. ఈ ముంబై కుర్రాడు దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్నాడు. కాగా తాజాగా మరోసారి తనదైన ఆటతీరుతో తెగబడ్డాడు. జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేసి అందరిచేత ఔరా అనిపిస్తున్నాడు ఈ యువ బ్యాటర్. సర్ఫరాజ్ ఆసీస్ దిగ్గజ ఆటగాడు, దివంగత డాన్ బ్రాడ్‌మన్ తర్వాత  స్థానంలో నిలవడం విశేషం. డొమెస్టిక్ క్రికెట్ లో బ్రాడ్‌మన్ సగటు 95.14గా ఉందనే విషయం తెలిసినదే.
బ్రాడ్‌మన్  234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 95.14 సగటుతో 28,067 పరుగులు సాధించాడు. కాగా ఇందులో 117 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 52 టెస్టులలో 6,996 పరుగులు వున్నాయి. టెస్టులలో ఈ దిగ్గజం సగటు 99.94గా ఉండటం గమనార్హం. బ్రాడ్‌మన్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక సగటు నమోదు చేసిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. ఇప్పటివరకు ఈ ముంబై కుర్రాడు.. 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 3,175 రన్స్ చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 9 హాఫ్  సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు  301గా ఉంది.  ఈ క్రమంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ సగటు  80గా ఉంది.
కాగా ఈ విషయంలో సర్ఫరాజ్ సచిన్, కోహ్లీని సైతం వెనక్కి నెట్టాడు. సచిన్ గురించి మాట్లాడుకోవాలంటే అతని సగటు 57.84గా ఉంది. అదేవిధంగా కోహ్లీ విషయానికొస్తే.. తన కెరీర్ లో విరాట్ 136 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 10,368 పరుగులు చేశాడు. దాంతో కోహ్లీ సగటు 50.08 గా ఉంది. ఇక రంజీ ట్రోఫీలో భాగంగా అస్సాం - ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సర్ఫరాజ్.. 32 బంతుల్లో 28 పరుగులు చేసి  నాటౌట్ గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ లో నాటౌట్ గా ఉండటం ద్వారా సర్ఫరాజ్ సగటు 80 దాటింది. గతంలో కూడా ఒకసారి అతడు 80 ప్లస్ సగటును టచ్ చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: