కోహ్లీ సూపర్ సెంచరీ.. ఖాతాలో అరుదైన రికార్డ్?

praveen
దాదాపు మూడేళ్ల పాటు సెంచరీకి దూరమై ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇటీవల కాలంలో మాత్రం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ సెంచరీలతో చెలరేగిపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇక మూడేళ్ల నిరీక్షణకు తెరదించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం ఇక ప్రతి మ్యాచ్ లో కూడా సెంచరీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మళ్లీ ప్రపంచ రికార్డులు వేటను కొనసాగిస్తూ అదరగొడుతున్నారు. ఇక కోహ్లీ ఏదైనా మ్యాచ్ ఆడుతున్నాడు అంటే చాలు ప్రపంచ రికార్డు కొట్టడం ఖాయం అనే విధంగానే అతని ప్రస్థానం కొనసాగుతోంది.


 ఈ క్రమంలోనే ఇటీవలే శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో సెంచరీస్ చేసి అదరగోత్తిన విరాట్ కోహ్లీ ఇక మూడో వన్డే మ్యాచ్లో కూడా అలాంటి విధ్వంసాన్ని కొనసాగించాడు. అంతకుమించి అనే రేంజ్ లోనే సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా కోళ్లగొట్టాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అతని పేరు మార్మోగిపోతుంది అని చెప్పాలి. ఏకంగా మూడో వన్డే మ్యాచ్లు 166 పరుగులు చేసి చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ అద్వితీయమైన సెంచరీ కారణంగా ఇక ప్రపంచ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డ్ లను  ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ప్రత్యర్ధిపై 10 వన్ డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. దీంతో పాటు చరిత్రలో 150 కంటే ఎక్కువ పరుగులు ఐదుసార్లు చేసినా నాన్ ఓపెనర్ గా కూడా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సరిగ్గా సంక్రాంతి రోజున జరిగిన మ్యాచ్లో చిలరికి పోయి సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ అభిమానులకు అసలు సిసలైన సంక్రాంతి పండుగను తన సెంచరీ తో తెచ్చిపెట్టాడు అని ఎంతో మంది అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: