జట్టులో నో చాన్స్.. సర్ఫరాజ్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఈ  ఏడాది భారత్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అర్హత సాధించేందుకోసం టీమిండియా ఆస్ట్రేలియాతో హోరాహోరీగా తలబడబోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాపై టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది.

 ఈ క్రమంలోనే జట్టు ఎంపిక విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన టీమ్ ఇండియా జట్టు ఏకంగా టి20 ఫార్మాట్ లో అదరగొడుతున్న సూర్య కుమార్ యాదవ్ను టెస్ట్ ఫార్మాట్ లోకి కూడా తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ విషయం పైన ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. దేశవాళి క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తూ అదరగొడుతున్న సర్పరాజ్ ఖాన్ ను కాదని సూర్య కుమార్ యాదవ్ను జట్టులోకి తీసుకోవడం ఏంటి అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. బిసిసిఐ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో తనకు చోటు దక్కకపోవడం పై అటు సర్పరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు అని చెప్పాలి. ఈ విషయంపై ఇటీవలే మాట్లాడుతూ బిసిసిఐ ప్రకటించిన జట్టులో తన పేరు ఉంటుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఛాన్స్ దక్కకపోవడంతో రాత్రంతా నిద్ర రాలేదంటూ తెలిపాడు. పరుగులు సాధిస్తున్నప్పటికీ ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. జీవితంలో ఎన్నో బాధలు అనుభవించాను. కానీ డిప్రెషన్ లోకి వెళ్ళను. ఎందుకంటే అవకాశం వచ్చేంత వరకు పరుగులు చేస్తూనే ఉంటాను అంటూ సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: