టెస్టుల్లోకి పిలుపు రాగానే.. మా నాన్న ఒకటే చెప్పారు : ఇషాన్ కిషన్
ఇకపోతే ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో అంతకుముందు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రాణించిన ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్లోకి కూడా అరంగేట్రం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టీ20 వన్డే ఫార్మాట్లో తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించిన ఇషాన్ కిషన్ ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతను కూడా చోటు దక్కించుకున్నాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో అడుగుపెట్టడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను వన్డే క్రికెట్లో రాణించిన ప్రతిసారి కూడా మా నాన్న ఒక మాట అంటూ ఉండేవారు. వన్డే క్రికెట్ కాదు టెస్ట్ ఫార్మాట్ అసలైన గేమ్. ఇక ఎన్నో సవాల్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రికెటర్ నైపుణ్యాలకు కూడా టెస్ట్ ఫార్మాట్ అసలైన పరీక్ష పెడుతూ ఉంటుంది అంటూ చెప్పేవారు. ఇక ఇప్పుడు నాన్న కోరిక ఉన్న ప్రకారమే టెస్ట్ జట్టులోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇక టెస్టు జట్టు కోసం పిలుపు రాగానే ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావో.. అలాగే కష్టపడాలని మా నాన్న చెప్పారు అంటూ ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.