ప్రాక్టీస్ మొదలెట్టిన ధోని.. వీడియో వైరల్?

praveen
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినిపించింది అంటే చాలు అభిమానులు అందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగానే ఊగిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీకి ఆ రేంజ్ లో క్రేజీ ఉంది. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు ఏళ్లు గడుస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లతో పోల్చి చూస్తే అటు ధోనీకే ఎక్కువ క్రేజ్ ఉంది అని చెప్పాలి. ధోని ఒక్కసారి క్రికెట్ మైదానంలో కనిపించాడు అంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు  ఉండవు అని చెప్పాలి.

 అయితే భారత క్రికెట్ చరిత్రలో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా భారత జట్టుకు రెండు వరల్డ్ లు అందించిన ఏకైక సారథిగా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని.. అటు ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా కూడా అదే రీతిలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వరకు నాలుగు సార్లు టైటిల్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం తర్వాత కేవలం ఐపిఎల్ లో మాత్రమే ధోని ఆటను చూడగలుగుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే 2023 సీజన్ కోసం ధోని అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పాలి.

 ఇకపోతే అటు 2023 ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి కొన్ని నెలలు ముందు నుంచి అటు మహేంద్ర సింగ్ తోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తూ కనిపిస్తూ ఉండడంతో ఇది చూసి ఫ్యాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోతున్నారు. ఇక ప్రస్తుతం మినీ వేలంలో కొత్త ఆటగాళ్లు కొనుగోలు చేసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో పటిష్టంగా మారిందని.. ఈ ఐపిఎల్ ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్ దే అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: