కెమెరామెన్ పై.. రోహిత్ శర్మ సీరియస్?
ఇక ఈ మ్యాచ్ లో భాగంగా మూడవరోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది అని చెప్పాలి. రెండో ఇన్నింగ్స్ లో 17 ఓవర్ రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. అయితే ఈ ఓవర్లో బంతిని హాండ్స్ కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ కి తగలకుండా ప్యాడ్స్ కి తగిలింది అని చెప్పాలి. దీంతో బౌలర్ అశ్విన్ ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ ఎంపైర్ అది నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ డిఆర్ఎస్ కు వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఇక మైదానం నుంచి కనబడే పెద్ద స్క్రీన్ లో ఏం చూపిస్తారా అని అందరూ అటువైపు చూడటం మొదలుపెట్టారు.
ఇలాంటి సమయంలోనే కెమెరామెన్ అది అవుటా కాదా అని రిప్లైలను చూపించకుండా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొహాన్ని స్క్రీన్ పై చూపించాడు. దీంతో ఎప్పుడు కూల్ గా ఉండే రోహిత్ శర్మ ఒక్కసారిగా అసహనానికి గురయ్యాడు. నన్నెందుకు చూపిస్తున్నావు రివ్యూ చూపించు అంటూ కెమెరామెన్ వైపు చూస్తూ సీరియస్గా అన్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్, షమీ, అశ్విన్ కాసేపు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి..