వరల్డ్ కప్ లో ఘోర తప్పిదం.. చేసింది అంపైర్లే?

praveen
సాధారణం గా అంతర్జాతీయ మ్యాచ్ ఎక్కడ జరిగిన కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారమే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు నిబంధనలు పక్కనపెట్టి ఆడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇక ఫీల్డ్ ఎంపైర్లు దానిని సరి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఫీల్డ్ ఎంపైర్లకు అయితే ఐసీసీ నిబంధనలపై దాదాపు పూర్తి అవగాహన ఉంటుంది. ఇక ఇలా నిబంధనలకు అనుగుణంగానే ఫీల్డ్ ఎంపైర్లు కూడా నిర్ణయాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం.


 అయితే ఇప్పుడు వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయం లో ఆటగాళ్లు ఇలా పొరపాటున నిబంధనలు ఉల్లంఘించడం గురించి ఎన్నోసార్లు విన్నాం.  కానీ ఏకంగా అంపైర్లు గా వ్యవహరిస్తున్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించడం మాత్రం దాదాపు జరగదు అని చెప్పాలి. కానీ ఇటీవలే ఒక ఉత్కంఠ భరితమైన పోరు లో మాత్రం ఫీల్డ్ ఎంపైర్లుచేసిన తప్పిదం ప్రస్తుతం అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో అంపైర్ల నుండి ఘోర తప్పిదం  చోటుచేసుకుంది అని చెప్పాలి. అయితే భారత్ టార్గెట్  చేదిస్తున్న సమయంలో ఏడవ ఓవర్ వేసిన పాకిస్తాన్ బౌలర్ నినాదార్ ను ఏకంగా ఆరుకు బదులు ఏడు బంతులు వేయించారు బౌలర్లు. అయితే ఏడవ బంతికి ఫోర్ వచ్చింది అని చెప్పాలి. ఇక పాకిస్తాన్ అభిమానులు తమ జట్టు ఓటమికి ఈ కారడాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 20 ఓవర్లలో149 పరుగులు చేస్తే భారత జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: