లేడీ సూర్య కుమార్ ఆటకు.. క్రికెట్ దేవుడు సచిన్ ఫిదా?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ప్రపంచంలో ఎన్నో దేశాల్లో క్రికెట్ ఆడుతున్నప్పటికీ భారత్లో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మరే దేశంలో లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రికెటర్లను ఏకంగా దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నప్పటినుంచి క్రికెట్ ఊపిరిగా బ్రతుకుతూ ఇక టీమిండియా తరఫున ఆడడమే లక్ష్యంగా ప్రతి అడుగు వేస్తూ ఉన్నారు. కాగా ఇక మట్టిలో మాణిక్యాలు లాంటి ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఇక ఇటీవల ట్విట్టర్ వేదికగా ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో ఎక్కడో చిన్నారులు అందరూ కూడా గల్లి క్రికెట్ ఆడుతున్నారు. అయితే అక్కడ ఒక బ్యాటింగ్ చేస్తున్న చిన్నారి మాత్రం అచ్చం టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ తరహా లోనే అద్భుతమైన షాట్లు ఆడింది. ప్రతి బంతిని సిక్సర్ కొట్టుతూ ఇక అదరగొట్టింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో ఎంతోమంది క్రికెట్ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది అని చెప్పాలి. ఏకంగా ఈ లేడీ సూర్యకుమార్ ఆట తీరు చూసి సచిన్ ఫిదా అయిపోయాడు.



 స్వయంగా ఆ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ కు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన వేలం ప్రక్రియ ముగిసింది లేదో. అప్పుడే మ్యాచ్ ప్రారంభమైందా అంటూ కామెంట్ చేశాడు.  నీ బ్యాటింగ్ బాగా ఎంజాయ్ చేశాను అంటూ ఒక కామెంట్ చేశాను. అయితే ఏకంగా క్రికెట్ దేవుడు ఇలాంటి కామెంట్ చేయడంతో ఆ చిన్నారి ఆనందంలో మునిగిపోయింది అని చెప్పాలి. రాజస్థాన్ కు చెందిన అమ్మాయి ఇలా సిక్సర్లతో విరుచుకు పడింది. కేవలం సచిన్ మాత్రమే కాదు బిసిసిఐ సెక్రటరీ జై షా సైతం చిన్నారి టాలెంట్ కి ఫిదా అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: