ఇలా ఆడతానని.. కలలో కూడా ఊహించలేదు : పూజారా

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇందులో భాగంగా ఇరు జట్లు కూడా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాయి. అయితే ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ ముగిసింది. నాగపూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఈ క్రమంలోనే పటిష్టమైన ఆస్ట్రేలియా పై 132 పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.


ఇక రేపు ఢిల్లీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇక టీమ్ ఇండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న చటేశ్వర్ పూజార ఒక అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా తన కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇప్పటివరకు భారత క్రికెట్లో కేవలం 12 మంది ఆటగాళ్లకు మాత్రమే ఇలా 100వ టెస్ట్ మ్యాచ్ ఆడటం సాధ్యమైంది. ఇక ఇప్పుడు పూజార 13వ ఆటగాడిగా ఈ రికార్డు సృష్టించబోతున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే చట్టేశ్వర్ పూజార 100వ టెస్టు మ్యాచ్లో సెంచరీ చేస్తే బాగుండు అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కాగా 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండడం పై స్వయంగా పూజారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్కు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడతానని కలలో కూడా ఊహించలేదు అంటూ పూజార చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ని అందించడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు చటేశ్వర పూజారా కు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే పేలవ ఫామ్ నుంచి మళ్లీ మునుపటి ఫామ్ను అందుకున్న పూజార ఇప్పుడు పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: