ఆ ఇద్దరి గురించి మాటల్లేవ్.. అదుర్స్ అంతే : రోహిత్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత స్పిన్ విభాగం ఎంత కీలకపాత్ర వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ లపై ఇక తమ అధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇండియా బౌలర్లు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో తమ స్పిన్ బౌలింగ్ తో అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు ముచ్చెమటలు పట్టించిన రవీంద్ర  జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లోను అదే జోరును కొనసాగించారు అని చెప్పాలి.

 కాగా మొదటి మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టు... ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆరు వికెట్ల తీయడంతో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2-0 తేడాతో ఆదిఖ్యాన్ని సంపాదించింది. అయితే ఈ రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా ఎంత పుంజుకోవాలని ప్రయత్నించిన కూడా కోలుకోలేని దెబ్బకొట్టింది మాత్రం మళ్లీ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలే అని చెప్పాలి. ముఖ్యంగా రవీంద్ర జడేజా అయితే రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఓటమిని శాసించాడు.

 భారత విజయంలో కీలకపాత్ర వహించిన ఇద్దరు స్పిన్నర్లపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే మ్యాచ్ లో విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అశ్విన్ జడేజాలపై ప్రశంసలు  కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేసాడు. జడేజా, కోహ్లీల  భాగస్వామ్యం..  అక్షర్, అశ్విన్ ల పోరాటం టీమిండియా విజయానికి బాటలు వేసాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భారత బౌలర్లు అద్భుతం చేశారని.. ముఖ్యంగా రవీంద్ర జడేజా, అశ్విన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా టీమిండియా మరో టెస్ట్ మ్యాచ్ గెలిచిందంటే చాలు నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: