కోహ్లీ ఇలా చేసావేంటి.. తగలరాని చోటు తగిలితే ఎలా?
అయితే విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత ఎనర్జీతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అతని దూకుడు చూసి ప్రత్యర్థులు సైతం భయపడిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎనర్జీ అనే పదం అతని కోసమే పుట్టిందేమో అనేంతలా దూకుడుగా ఉంటాడు అని చెప్పాలి. ఏదైనా చిన్న తప్పు జరిగితే ప్రత్యర్థులపై దూసుకుపోయి గొడవకు దిగడమే కాదు ఇక తన సహచరులతో సరదాగా గడపడంలో విషయంలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడు అని చెప్పాలి. ముఖ్యంగా కోహ్లీ కొన్ని కొన్ని సార్లు చేసే చిలిపి పనులు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.
ఇక ఇప్పుడు సీనియర్ క్రికెటర్ అయినప్పటికీ ఒక యువ క్రికెటర్ తో కోహ్లీ ప్రవర్తించిన తీరు కాస్త ప్రస్తుతం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇక రెండవ టెస్టు మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ ఒక చిలిపి పనిచేశాడు. టీమిండియా ఆటగాళ్లందరూ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా నవ్వుతూ మాట్లాడిన విరాట్ కోహ్లీ సడన్ గా గిల్ వద్దకు వచ్చి పొట్ట కింది భాగంలో ఒక పంచ్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఎగిరి గంతేసాడు గిల్. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన నేటిజన్స్.. కోహ్లీ ఏంటి ఇలా చేశావు.. ఒకవేళ గిల్ కి తగలరని చోటు తగిలితే పరిస్థితి ఏంటి అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.