ఆస్ట్రేలియా ఓటమిని.. డీకే ముందే ఊహించాడా?

praveen
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆతిధ్య భారత జట్టు అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. స్వదేశీ పరిస్థితిలను బాగా వినియోగించుకుంటూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాకు పుంజుకునేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అసాధారణమైన ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇండియా జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్లో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ అటు రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం ఆస్ట్రేలియాను భారత జట్టు కోలుకోలేని దెబ్బ కొట్టింది అని చెప్పాలి  అయితే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు భారత ప్రదర్శన పై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే భారత సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్ మాత్రం ఆస్ట్రేలియా తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవుతుందని ఇక టీమిండియా తప్పక గెలుస్తుంది అని ముందే ఊహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి.



 రెండో రోజు ఆట అనంతరం క్రిక్బజ్ షోలో మాట్లాడాడు దినేష్ కార్తీక్. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాఖ్యాత హర్ష బోగ్లే నుంచి దినేష్ కార్తీక్ కి ఒక ప్రశ్న ఎదురైంది  ఆస్ట్రేలియా అద్భుతమైన పునరాగమనం చేసింది. భారత్ ముందు ఎంత లక్ష్యాన్ని ఉంచగలదు అంటూ దినేష్ కార్తీక్ ను హర్ష భోగ్లే ప్రశ్నించాడు. ఇందుకు బదులు ఇచ్చిన దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియా టీమిండియా ముందు 120 నుంచి 130 పరుగులు మాత్రమే చేయగలదు అంటూ సమాధానం ఇచ్చాడు. అతను ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా కేవలం 113 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: