ఎంత పిఎస్ఎల్ లో ఆడితే మాత్రం.. కోహ్లీ కంటే బాబర్ బెటర్ అంటావా?
ఐపీఎల్ లో పాల్గొన్న ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా వివిధ జట్ల తరఫున ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో ఇక రెండు లీగ్ లను కూడా సమానంగానే చూస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ సూపర్ లీక్ లో ఆడితే ఇక విదేశీ ఆటగాళ్లు సైతం భారత ఆటగాళ్లపై విషం కక్కేస్తారా అంటే ఇక ఇటీవల ఏకంగా ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్న డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమే అన్నది అర్థమవుతూ ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టు తరఫున డేవిడ్ మిల్లర్ ఆడుతూ ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నాడు డేవిడ్ మిల్లర్. ఈ క్రమంలోనే బాబర్ అజాం కవర్ డ్రైవ్ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవర్ కంటే బాగుంటుంది అంటూ డేవిడ్ మిల్లర్ అనడం పెద్ద చర్చకు దారి తీసింది అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఆల్ టైం గా పిలుస్తూ ఉంటారు. ఇక నేటి తరంలో విరాట్ కోహ్లీ కంటే మెరుగైన బ్యాట్స్మెన్ ఎవరూ లేరు అని దిగ్గజాలు సైతం అభివర్ణిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇక పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో బాబర్ కూడా ఒక అద్భుతమైన బ్యాటర్ అని చెప్పాలి. గత కొంతకాలం మంచి ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ అజాన్ ను పోల్చి చూడటం కూడా చేస్తూ ఉన్నారు. ఎవరి కవర్ ట్రై బాగుంటుంది అంటే బాబర్ అజం కవర్ డ్రైవ్ బాగుంటుందని డేవిడ్ మిల్లర్ చెప్పడం కాస్త సంచలనంగా మారింది అని చెప్పాలి. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.