మొబైల్ ప్రాణం తీసేసింది.. అసలు ఏం జరిగిందంటే?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో శరీరంలో ఏదైనా అవయవం తక్కువైనా బతకగలుగుతారేమో కానీ అర చేతిలో సెల్ ఫోన్ లేకపోతే మాత్రం అస్సలు బ్రతకలేరు అనేంతలా ప్రస్తుతం మొబైల్ ఫోన్ మనుషులను బానిసలుగా మార్చేసుకుంది అని చెప్పాలి  ఇక ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏది కావాలన్నా ఇక అర చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో ఒక క్లిక్ ఇస్తే చాలు ఇంటి ముందటికి వచ్చి వాలిపోతూ ఉంది. దీంతో ఇక మొబైల్ ఫోన్ వినియోగదారులకు మిగతా ప్రపంచంతో పని లేకుండా పోయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే కేవలం మనిషి అవసరాలు తీర్చడానికి మాత్రమే కనుగొన్న మొబైల్ ఇప్పుడు ఏకంగా ఆరడుగుల మనిషిని ఆటాడిస్తుంది అని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా చివరికి మొబైల్ అర చేతిలో ఉండాల్సిందే. ఇక మొబైల్ అరచేతిలో లేదు అంటే ఏదో విలువైనది కోల్పోయామే అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. అయితే మొబైల్ అతిగా వాడటం ద్వారా ఎన్నో అనగాలు ఉన్నాయని తెలిసిన ఎంతోమంది మొబైల్ లోనే గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు.

 అయితే ఇక్కడ ఏకంగా మొబైల్ కారణంగా ఒక ప్రాణం బలి అయింది. మధ్యప్రదేశ్లో మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలి 68 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉజ్జయిని జిల్లా బాద్ నగర్ పట్టణానికి చెందిన దయారాం బరోడ్ ఫోన్ ఎత్తకపోవడంతో అతని స్నేహితుడు ఇంటికి వచ్చి చూడగా విగత జీవిగా  కనిపించాడు. అతని ఛాతి భాగంపై కూడా గాయాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక చార్జింగ్ పెట్టే ప్లగ్ బోర్డు కూడా పూర్తిగా కాలిపోయి ఉండడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: