జడేజా అదుర్స్.. అరుదైన రికార్డ్?

praveen
టీన్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ అదరగొడుతున్నాడు అనే విషయం తెలిసిందే. మోకాలు గాయంతో బాధపడిన రవీంద్ర జడేజా సర్జరీ చేయించుకున్నాడు. అయితే 5 నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ద్వారా మళ్ళీ జట్టులోకి వచ్చాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కుదురుకోవడానికి మళ్ళీ సమయం తీసుకోకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి.

 అయితే కేవలం బంతితో మాత్రమే కాదు బ్యాట్ తో కూడా బాగా రాణిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే   ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్మెన్లు అందరికీ కూడా రవీంద్ర సింహ స్వప్నంలా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అలాగే వికెట్లు పడగొడుతూ అదరగొడుతున్నాడు. ఇకపోతే ఇటీవలే రవీంద్ర జడేజా ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడవ టెస్టులో భాగంగా ఒక వికెట్ పడగొట్టడం ద్వారా అరుదైన రికార్డింగ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

 భారత క్రికెట్లో కేవలం కొంత మందికి మాత్రమే సాధ్యమైన రికార్డును రవీంద్ర జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా అంతర్జాతీయ మ్యాచ్లలో 500 వికెట్లతో పాటు 5 వేల పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్ రవీంద్ర జడేజా కావడం గమనార్హం. ఇప్పటికే బ్యాట్ తో 5528 పరుగులు చేశాడు.  ఇక ఇటీవల మూడో టెస్టులో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా 500 వికెట్ల మార్క్ అందుకున్నాడు. జడేజా కంటే ముందు కపిల్ తో 9031 రన్స్ 687 వికెట్లతో టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: