అటు IPL.. ఇటు WPL.. ముంబై ఇండియన్స్ లో సేమ్ టు సేమ్?
కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత మాత్రం అటు మహిళా క్రికెటర్లు పురుష క్రికెటర్లకు ఎక్కడ తక్కువ కాదు అనే రీతిలో కోట్ల రూపాయల ధర పలికారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ తరహా లోనే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడి మహిళా క్రికెట్కు ఆదరణ పెంచబోతున్నారు ఎంతోమంది ఉమెన్ క్రికెటర్లు. ఇకపోతే మరికొన్ని రోజులు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక అన్ని జట్లు కూడా తమ ప్రత్యర్థులను ఎదుర్కోబోయే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయ్. ఇక మరికొన్ని జట్లు తమ జట్టుకు కెప్టెన్ ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కొనసాగితేనే ముంబై ఇండియన్స్ గురించి కెప్టెన్ గా హార్మన్ ప్రీత్ ను ఎంపిక చేశారు. మొదటి నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే హార్మన్ ప్రీత్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ హర్మన్ ప్రీత్ ను వేలంలో 1. 8 కోట్లకు దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం భారత మహిళల జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతూ ఉంది హార్మన్ ప్రీత్. అయితే అటు పురుషుల క్రికెట్ లో కూడా ఇదే జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్ గా ఉన్న రోహిత్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్మన్ ముంబై సారథిగా మారింది అని చెప్పాలి.