బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: అత్యధిక వికెట్లు తీసింది వీరే?

Purushottham Vinay
ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 2-1 తేడాతో సిరీస్‌లో ఆసిస్ పునరాగమనం చేసింది.ఇక మొత్తం 76 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ల కోల్పోయి ఆసిస్ విజయం సాధించింది. అయితే ఇండియాని ఓడించడంలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియాన్ చాలా కీలకపాత్ర పోషించాడు. అతని ప్రదర్శనతో ఏకంగా అనిల్ కుంబ్లే పాత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లియన్ చరిత్రలో నిలిచాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాథన్ లియాన్ ఇప్పటి దాకా మొత్తం 113 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో అనిల్ కుంబ్లే 111 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.అలాగే రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ మొత్తం 106 వికెట్లు తీశాడు. ఆ తరువాత హర్భజన్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఇతను మొత్తం 95 వికెట్లు తీశాడు. ఆ తరువాత రవీంద్ర జడేజా 84 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఈ ఇండోర్ టెస్టులో నాథన్ లియాన్ చాలా సమర్థవంతంగా బౌలింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 11.2 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు. ఇందులో అతను 2 మెయిడిన్ ఓవర్లు కూడా విసిరాడు. ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో కూడా లయన్‌దే ఆధిపత్యంగా నిలిచింది.మొత్తం 23.3 ఓవర్లలో 64 పరుగులిచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో టీమిండియా చాలా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ మొత్తం 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండో మ్యాచ్‌లో ఏకంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో మాత్రం ఆసిస్ ఘన విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: