నాలుగో టెస్ట్ కోసం.. అలాంటి పిచ్ కావాలి : గవాస్కర్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది . ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిసాయి. అయితే మొదటి రెండు మ్యాచ్లలో టీమిండియా జట్టు సత్తా చాటి ఘనవిజయలను అందుకుంది.  కానీ ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా పుంజుకొని భారత జట్టును దెబ్బ కొట్టింది. ఈక్రమంలోనే నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇక సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అదే సమయంలో ఇక భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే తప్పనిసరిగా నాలుగో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ మ్యాచ్ లో పోరు హోరాహోరీగా జరగడం ఖాయమని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి కూడా భారత్లో ఉన్న పిచ్ ల గురించి తీవ్రమైన చర్చ జరుగుతూనే ఉంది. స్పిన్ పీచులను తయారు చేసి భారత జట్టు విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు విమర్శలు చేశారు.

 ఇక ఇలాంటి ఆరోపణలపై అటు భారత మాజీలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు అని చెప్పాలి. ఇక ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో పిచ్ కి ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇదే విషయంపై భారత దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టెస్ట్ కి బ్యాలెన్స్ పిచ్ తయారు చేయాలని బీసీసీఐకి సూచించాడు. మొదటి రెండు రోజులు కొత్త బంతి బౌలర్లకు సహకరించేలా.. బ్యాట్స్మెన్లు పరుగులు చేసేలా ఉండాలని  అభిప్రాయపడ్డాడు. అయితే చివరి రెండు రోజులు బంతి తిరగాలని వివరించాడు. అయితే అహ్మదాబాద్ పిచ్ టర్న్ అయితే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: