కోహ్లీ.. ఇలా చాక్లెట్లు తింటే.. క్యాచ్‌లు జారిపోవా?
ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమమైన ఫీల్డర్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. కానీ అలాంటి విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి బ్యాటింగ్‌లో మాత్రమే కాదు ఫీల్డింగ్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీ ఫీల్డింగులో అయితే కీలకమైన క్యాచ్ లు జార విడుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా చాక్లెట్లు తింటూ కాలక్షేపం చేయడం కాస్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సాధారణంగానే టెస్ట్ మ్యాచ్‌లు సుదీర్ఘంగా దాదాపు 90 ఓవర్ల పాటు సాగుతాయి. కాబట్టి ఇక తమలో ఎనర్జీ నింపుకునేందుకు ఎంతో మంది ప్లేయర్లు చిరు తిండ్లు తినడం లాంటివి కెమెరాల్లో చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఇక వీలైనప్పుడల్లా నోట్లో ఏదో ఒకటి వేసుకొని ఎనర్జీని తెచ్చుకోవడం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వారికి బాగా సెట్ అవుతూ ఉంటుంది. కానీ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క సెకండ్ ఆలస్యమైన కీలకమైన క్యాచ్ లు చేజారి పోతూ ఉంటాయి. కానీ కోహ్లీ మాత్రం స్లీప్ లో ఫీల్డింగ్ చేస్తూన్న సమయంలో చాక్లెట్ తింటూ కనిపించడంతో అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాక్లెట్ తిన్నాక ఇక క్యాచ్ లు మిస్ అవ్వకుండా ఎలా ఉంటాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.