ఐపీఎల్ మధ్యలోనే.. ఆటగాళ్లను డబ్ల్యూటీసి ఫైనల్ కు పంపుతాం : రోహిత్
ఈ విషయంపై టీమిండియా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసింది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ప్లేయర్లపై భారం పడకుండా ఉండేందుకు జట్టు మేనేజ్మెంట్ ఐపీఎల్ 2023 జరుగుతున్నప్పుడే డబ్ల్యూటీసి సన్నాహాల్లో భాగంగా కొంతమందిని ముందే ఇంగ్లాండ్ పంపిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇది నిజంగానే మాకు కాస్త ఇబ్బందికరమైన విషయం. మేము డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోయే ఆటగాళ్లు అందరితోనూ నిరంతరం టచ్ లో ఉంటాం. వారి వర్క్ లోడ్ ను పర్యవేక్షిస్తూ ఉంటాం. మే 21 నాటికి ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ముగుస్తాయ్. ప్లే ఆఫ్ నుంచి ఆరు జట్లు తప్పుకుంటాయి. కాబట్టి ఎవరెవరు అందుబాటులో ఉంటారో.. వారిని వీలైనంత వరకు ఇంగ్లాండు ముందుగానే పంపిస్తాము. వారి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తామంటు రోహిత్ చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపిక చేసే జట్టు గురించి మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. జట్టు ఎంపిక పెద్ద సమస్య అనుకోవట్లేదు అంటూ ఓకే రోహిత్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ఫైనల్ లో ఆడే ఆటగాళ్లు డబ్ల్యూ టిసి ఫైనల్ లో ఉండే ఆటగాళ్లు కాదని.. నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్న ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు. మిగిలిన వారందరూ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ లో తప్పకుండా ఆడతారు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవలేని న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోవడంతో ఎలాంటి సమీకరణాలు లేకుండానే టీమ్ ఇండియా అటు డబ్ల్యూటీసి ఫైనల్ అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇక నాలుగో మ్యాచ్ డ్రాగ ముగించింది అని చెప్పాలి.