రిటైర్మెంట్ ప్రకటించిన.. దిగ్గజ ఎంపైర్.. ఎవరంటే?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు ఒక వయస్సు వచ్చిన తర్వాత తమ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు ఇక మ్యాచ్ కు అంపైర్లుగా కొనసాగుతున్న వారు సైతం వయస్సు మీద పడిన తర్వాత ఇక తమ వృత్తికి రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇటీవలే ఒక అంపైర్ సైతం ఇలాగే తన 19 ఏళ్ళ కెరియర్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ అంపైర్గా పేరు సంపాదించుకున్నాడు అలిమ్ దార్.

 పాకిస్తాన్ కు చెందిన 54 ఏళ్ల అలిందార్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్గా విధులు నిర్వహించాడు. 435 అంతర్జాతీయ మ్యాచ్లకు అంపైరింగ్ చేశాడు అని చెప్పాలి. 2007, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ తో పాటు 2010, 2012 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో కూడా అంపైరింగ్ చేశాడు. ఇక 2000 సంవత్సరంలో తన ఎంపైర్ కెరియర్ ప్రారంభించిన అలీమ్ దార్ పాకిస్తాన్ నుంచి ఐసీసీ లైవ్ పానల్ ఎంపైర్ లిస్టులో చోటు దక్కించుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు అని చెప్పాలి.  మొత్తంగా అలిమ్ దార్ తన కెరీర్లు 435 మ్యాచ్లో..  222 వన్డేలు, 144 టెస్ట్ మ్యాచ్లు,  69 టీ20 మ్యాచ్లకు ఎంపైరింగ్ చేశాడు.

 అయితే ఇటీవల  అంపైరింగ్ కెరియర్ కి వీడ్కోలు పలకడం గురించి అలిమ్ దార్ స్పందిస్తూ ఎంపైర్గా లాంగ్ జర్నీని బాగా ఎంజాయ్ చేశాను. ఒక అంపైర్ గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పేరు తెచ్చుకోవడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.  అంపైరింగ్ కెరీర్ ని ప్రారంభించిన కొత్తలో ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఎంపైర్లకు ఒక సూచన కూడా ఇచ్చాడు.  ఎప్పుడు  ప్రశాంతంగా ఉంటూ మర్యాదగా నడుచుకోండి.. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఎప్పుడు ఉత్సాహం చూపించండి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: