WPL 2023: గొల్లుమంటున్న "ఆర్సీబీ" ఫ్యాన్స్... ప్లే ఆఫ్ చేరిన యూపీ వారియర్స్ !

VAMSI
మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరిన మూడు జట్లుగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్, మెగ్ లానింగ్ కెప్టెన్ గా చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు అలీసా హీలీ కెప్టెన్ గా ఉన్న యూపీ వారియర్స్ లు రికార్డ్ సృష్టించాయి. కాగా ఈ టోర్నీని ప్రారంభించిన మరో రెండు జట్లు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరియు గుజరాత్ జయింట్స్ కు నిరాశే ఎదురైంది. జట్టు కూర్పు బాగున్నప్పటికీ సమిష్టిగా ఆడడంలో పూర్తిగా విఫలం అయిన ఈ రెండు జట్లు లీగ్ దశలోనే ఇంటి దారి పట్టాయి.
అయితే గత రెండు రోజుల క్రితం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు గుజరాత్ జయింట్స్ పైన భారీ విజయం సాధించి మెరుగైన రన్ రేట్ ను సాధించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసిన మ్యాచ్ లో గుజరాత్ జయింట్స్ పైన యూపీ వారియర్స్ మూడు వికెట్లతో ఘన విజయం సాధించి... ఈ సీజన్ లో యూపీ ఆడిన 7 మ్యాచ్ లలో 4 గెలిచి 8 పాయింట్ లతో ప్లే ఆఫ్ కు చేరింది. కాగా ఈ మ్యాచ్ లో కనుక గుజరాత్ యూపీని ఓడించి ఉంటే ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉండేవి. కానీ ఆ అవకాశం లేకుండా యూపీ వారియర్స్ గుజరాత్ ను ఓడించి ఒక్క దెబ్బతో ఇద్దరినీ ఇంటి దారి పట్టించింది.
ఈ రిజల్ట్ అనంతరం ఆర్సీబీ అభిమానులు గొల్లుమంటూ ఏడుస్తున్నారని చెప్పాలి. మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 1 లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఘోరంగా ప్రదర్శన చేసి లీగ్ దశ నుండి నిష్క్రమించనుంది. ఈ సీజన్ లో ఇండియా బెస్ట్ బ్యాటర్ స్మృతి మందన్న ను జట్టు యాజమాన్యం కెప్టెన్ గా నియమించింది. కానీ స్మృతి అటు కెప్టెన్ గా ఇటు ప్లేయర్ గా రాణించడంతో పూర్తిగా విఫలం అయ్యి అభిమానుల ఆశలను నేలపాలు చేసింది. మరి తర్వాత సీజన్ లో అయినా బెంగుళూరు టైటిల్ సాధిస్తుందా చూడాలి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: